మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Muktavali Stotram – శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం


బాలార్కకోటిరుచిరాం కోటిబ్రహ్మాండభూషితామ్ |
కందర్పకోటిలావణ్యాం బాలాం వందే శివప్రియామ్ || 1 ||

వహ్నికోటిప్రభాం సూక్ష్మాం కోటికోటిసహేలినీమ్ |
వరదాం రక్తవర్ణాం చ బాలాం వందే సనాతనీమ్ || 2 ||

జ్ఞానరత్నాకరాం భీమాం పరబ్రహ్మావతారిణీమ్ |
పంచప్రేతాసనగతాం బాలాం వందే గుహాశయామ్ || 3 ||

పరాప్రాసాదమూర్ధ్నిస్థాం పవిత్రాం పాత్రధారిణీమ్ |
పశుపాశచ్ఛిదాం తీక్ష్ణాం బాలాం వందే శివాసనామ్ || 4 ||

గిరిజాం గిరిమధ్యస్థాం గీః రూపాం జ్ఞానదాయినీమ్ |
గుహ్యతత్త్వపరాం చాద్యాం బాలాం వందే పురాతనీమ్ || 5 ||

బౌద్ధకోటిసుసౌందర్యాం చంద్రకోటిసుశీతలామ్ |
ఆశావాసాం పరాం దేవీం వందే బాలాం కపర్దినీమ్ || 6 ||

సృష్టిస్థిత్యంతకారిణీం త్రిగుణాత్మకరూపిణీమ్ |
కాలగ్రసనసామర్థ్యాం బాలాం వందే ఫలప్రదామ్ || 7 ||

యజ్ఞనాశీం యజ్ఞదేహాం యజ్ఞకర్మశుభప్రదామ్ |
జీవాత్మవిశ్వజననీం బాలాం వందే పరాత్పరామ్ || 8 ||

ఇత్యేతత్పరమం గుహ్యం నామ్నా ముక్తావలీస్తవమ్ |
యే పఠంతి మహేశాని ఫలం వక్తుం న శక్యతే || 9 ||

గుహ్యాద్గుహ్యతరం గుహ్యం మహాగుహ్యం వరాననే |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ || 10 ||

కన్యార్థీ లభతే కన్యాం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
బహునాత్ర కిముక్తేన చింతామణిరివాపరమ్ || 11 ||

గోపనీయం ప్రయత్నేన గోపనీయం న సంశయః |
అన్యేభ్యో నైవ దాతవ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || 12 ||

ఇతి శ్రీవిష్ణుయామలే శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.